News

దరఖాస్తు చేస్తే అనుమతిస్తాం


పాదయాత్ర చేస్తానంటున్న ముద్రగడ ముందు పాదయాత్రకు అనుమతి తీసుకోవాలని, ఆయన దరఖాస్తు చేస్తే అనుమతి ఇస్తామని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా పాదయాత్రలు చేయొద్దని సూచించారు. రాజకీయ లబ్ధి కోసమే ముద్రగడ ప్రభుత్వపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పాదయాత్రలు, దర్నాలు చేసినంత మాత్రాన కాపులు ఆయన మాటలు నమ్మే పరిస్థితిలో లేరని చినరాజప్ప వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాపులు గుర్తురాలేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం కాపులకు అండగా ఉందని, వారి సంక్షేమానికి కాపు కార్పొరేషన్‌ను కూడా ఏర్పాటు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని చినరాజప్ప అన్నారు.